మహిళా పోలీసుల గొప్ప మనసు

దిశ, వరంగల్: తిండి లేక ఇబ్బందులు పడుతున్న వలసకూలీలకు ఇద్దరు మహిళా పోలీసులు అండగా నిలిచారు. వారికి నిత్యావసర సరుకులు అందజేసి వారికి ఆకలితీర్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుళ్లు గా పనిచేస్తున్న శ్రీలత, స్వర్ణరెడ్డి లాక్‌డౌన్ నేపథ్యంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంతంలో నివాసం వుంటున్న వలసకూలీ కుటుంబాలు కొద్ది రోజులుగా తిండికి ఇబ్బందులకు పడుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాస్ […]

Update: 2020-04-01 00:31 GMT

దిశ, వరంగల్: తిండి లేక ఇబ్బందులు పడుతున్న వలసకూలీలకు ఇద్దరు మహిళా పోలీసులు అండగా నిలిచారు. వారికి నిత్యావసర సరుకులు అందజేసి వారికి ఆకలితీర్చారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుళ్లు గా పనిచేస్తున్న శ్రీలత, స్వర్ణరెడ్డి లాక్‌డౌన్ నేపథ్యంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంతంలో నివాసం వుంటున్న వలసకూలీ కుటుంబాలు కొద్ది రోజులుగా తిండికి ఇబ్బందులకు పడుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాస్ సూచన మేరకు వలస కూలీ కుటుంబాలకు క్వింటాల్ బియ్యంతో పాటు ఇతర నిత్యవసర వస్తువులు, కూరగాయలు, చిన్నారులకు తినుబండాలను అందజేశారు. వలసకూలీలను ఆదుకున్న హెడ్ కానిస్టేబుళ్లను హన్మకొండ ఇన్స్‌స్పెక్టర్ దయాకర్, సిబ్బంది అభినందించారు.

tags;women police,warangal,essential goods,supply,appreciate

Tags:    

Similar News