‘ఎర్రోళ్ల’కు మంత్రి హరీష్‌రావు సూచన.. ఏమనంటే?
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని టీఎంఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు. మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ల సమక్షంలో బుధవారం ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఉద్యమకారుడైన […]
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని టీఎంఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు. మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ల సమక్షంలో బుధవారం ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఉద్యమకారుడైన ఎర్రోళ్లకు ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు హరీష్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చైర్మన్ పదవి ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాకు మరో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల అద్భుతంగా పని చేశారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించిన ఎర్రోళ్లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎంఎస్ఐడీసీ గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ఎర్రోళ్లకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.