కరోనా పాజిటివ్ గ్రామాల్లో పర్యటించిన ఎర్రబెల్లి
దిశ, వరంగల్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం, కంటాయపాలెం, మడిపల్లిలోని వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం, అధికారులు అండగా ఉంటారని భరోసా కల్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముంబై నుంచి వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు? వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. ఈ దశలో భయపడాల్సిన పనిలేదని, ప్రజలంతా సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ, […]
దిశ, వరంగల్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం, కంటాయపాలెం, మడిపల్లిలోని వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం, అధికారులు అండగా ఉంటారని భరోసా కల్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముంబై నుంచి వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు? వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. ఈ దశలో భయపడాల్సిన పనిలేదని, ప్రజలంతా సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ, ఎవరికి వారు లాక్ డౌన్ పకడ్బందీగా పాటించాలని మంత్రి చెప్పారు. స్వీయ నియంత్రణలో ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వివరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాలపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మినహా ఇంకొకరికి రాకుండా ఆ గ్రామాలను క్వారంటైన్ చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా గ్రామాలను క్వారంటైన్ చేసిన సమయాల్లో మంచినీరు, ఆహారం, నిత్యావసర సరుకులు, ఇతర సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో వలంటీర్లను నియమించి, ప్రజావసరాలు తీర్చాలన్నారు. ఇలాంటి సమయంలో గ్రామాల్లోని నేతలు, ప్రజలకు అండగా నిలబడి ఆదుకోవాలని పిలుపునిచ్చారు.