‘గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి’

దిశ, వరంగల్: గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఆయన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బుధవారం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‌ సీఎం కేసిఆర్ గ్రామాల అభ్యున్నతికి పాటుపడుతున్నారనీ, ఇందులో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అడగ్గానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.600 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా […]

Update: 2020-03-18 01:17 GMT

దిశ, వరంగల్: గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఆయన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బుధవారం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‌ సీఎం కేసిఆర్ గ్రామాల అభ్యున్నతికి పాటుపడుతున్నారనీ, ఇందులో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అడగ్గానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.600 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు
Tags: panachayatiraj minister, errabelly dayakar rao, vardhannapet constituency, pallepragathi, kcr, TRS

Tags:    

Similar News