ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం : మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతిఇంటకీ తాగునీరు అందిస్తున్నామని నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శుక్రవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వి.భూపాల్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికీ తాగునీరు అందించే ప్రతిపాదన ఉందా అని మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ… మున్సిపాలిటీలో పది జనావాసాలు ఉన్నాయని అన్నారు. వాటిలో 3 జనావాసాలతో పాటు ఓఆర్‌ఆర్ పరిధిలోపల ఉండి వాటర్‌బోర్డు […]
దిశ, వెబ్‌డెస్క్: మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతిఇంటకీ తాగునీరు అందిస్తున్నామని నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శుక్రవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వి.భూపాల్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికీ తాగునీరు అందించే ప్రతిపాదన ఉందా అని మంత్రి ఎర్రబెల్లిని ప్రశ్నించారు.
దీనికి మంత్రి సమాధానం ఇస్తూ… మున్సిపాలిటీలో పది జనావాసాలు ఉన్నాయని అన్నారు. వాటిలో 3 జనావాసాలతో పాటు ఓఆర్‌ఆర్ పరిధిలోపల ఉండి వాటర్‌బోర్డు పరిధిలోకి వస్తాయన్నారు. మిగిలిన 7 గ్రామాలు ఓఆర్‌ఆర్ వెలుపల ఉన్నాయన్నారు. దాంతో ఓఆర్‌ఆర్ వెలుపల ఉన్న 7 గ్రామాలకు మంచినీటిని అందించే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సభకు వివరించారు.