యాదాద్రి ఆలయ అర్చకులు, సిబ్బందికి నోటీసులు
దిశ, నల్లగొండ: ముందస్తు సమాచారం లేకుండా గర్భాలయంలోకి పలువురి అనుమతించడంపై ఆలయ సిబ్బంది, పూజార్లు వివరణ ఇవ్వాలని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి నోటీసులు జారీ చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కాలంలో గర్భాలయంలోకి అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎవరిని అనుమతించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. దీనికి విరుద్ధంగా ఆలయ సిబ్బంది ప్రవర్తించడంతో చర్యలు తీసుకోనున్నారు. పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు అర్చకులు, ఇద్దరు […]
దిశ, నల్లగొండ: ముందస్తు సమాచారం లేకుండా గర్భాలయంలోకి పలువురి అనుమతించడంపై ఆలయ సిబ్బంది, పూజార్లు వివరణ ఇవ్వాలని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి నోటీసులు జారీ చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కాలంలో గర్భాలయంలోకి అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎవరిని అనుమతించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. దీనికి విరుద్ధంగా ఆలయ సిబ్బంది ప్రవర్తించడంతో చర్యలు తీసుకోనున్నారు. పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు అర్చకులు, ఇద్దరు అటెండర్లు, ఒక అధికారి ఉన్నారు.