కరోనాపై పోరుకు ఇంగ్లాండ్ క్రికెటర్ల భారీ విరాళం !
కరోనాపై పోరాటంలో పాలు పంచుకోవాలని ప్రతి దేశం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సాయాన్ని అడుగుతోంది. కాగా, ఎంతో మంది సెలెబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు తమ వంతు సాయం అందిస్తున్నారు. క్రీడాకారులు సైతం తమ వంతుగా విరాళాలు, వైద్య పరికరాలు అందిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా కరోనాపై పోరుకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రతీ క్రికెటర్ వేతనం నుంచి మూడు నెలల పాటు 20 శాతం వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ […]
కరోనాపై పోరాటంలో పాలు పంచుకోవాలని ప్రతి దేశం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సాయాన్ని అడుగుతోంది. కాగా, ఎంతో మంది సెలెబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు తమ వంతు సాయం అందిస్తున్నారు. క్రీడాకారులు సైతం తమ వంతుగా విరాళాలు, వైద్య పరికరాలు అందిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా కరోనాపై పోరుకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రతీ క్రికెటర్ వేతనం నుంచి మూడు నెలల పాటు 20 శాతం వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిపాదించింది. దీనికి క్రికెటర్లంతా ఆమోదం తెలిపారు. కేవలం పురుషులే కాక మహిళా క్రికెటర్లు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్లు ఈసీబీ వెల్లడించింది.
3 నెలల వేతనంలో 20 శాతం అంటే దాదాపు 5 లక్షల పౌండ్లతో సమానం. కాగా, ఇప్పటికే కొంత మంది క్రికెటర్లు వ్యక్తిగతంగా కూడా విరాళాలు ఇచ్చారు. జాస్ బట్లర్ తన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జెర్సీని వేలానికి పెట్టాడు. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హెథర్‌నైట్ కరోనాపై పోరాటంలో భాగంగా హెల్త్ సర్వీస్ వాలంటీర్‌గా సేవ చేస్తోంది.
Tags: Corona, England Cricketers, Donations, ECB