నాలుగో రోజు ఆట ముగిసింది.. గెలుపెవరిది..?

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మొదటి టెస్టు నాలుగో రోజు జరుగుతున్న ఆట ముగిసింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాంగ్ జట్టు కేవలం 178 పరుగులకే చేసింది. దీంతో 420 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ముందు రూట్ సేన 420 నిర్దేశించింది. ఇక నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 25 […]

Update: 2021-02-08 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మొదటి టెస్టు నాలుగో రోజు జరుగుతున్న ఆట ముగిసింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాంగ్ జట్టు కేవలం 178 పరుగులకే చేసింది. దీంతో 420 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ముందు రూట్ సేన 420 నిర్దేశించింది. ఇక నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగుల స్కోర్ బోర్డు వద్ద 12 రన్స్ చేసి.. జాక్ లీచ్ వేసిన బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (15), ఛతేశ్వర్ పుజార (12) పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి టెస్టుకు రేపే చివరి రోజు కావడం ఇండియాకు సవాల్‌గా మారింది. భారత్ ఇంకా 381 పరుగులు చేస్తే విజయం సాధించనుంది. టీమిండియా ఆటగాళ్లు రేపు డే చివరి వరకు నిలబడితే కనీసం డ్రా అయ్యే అవకాశాలు ఉన్నట్టు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం టీమిండియా స్కోర్ 39/1గా ఉంది.

Tags:    

Similar News