ఇంగ్లాండ్‌ది చెత్త బ్యాటింగ్ : మైఖేల్ వాన్

దిశ, స్పోర్ట్స్: అహ్మదాబాద్‌లో టీమ్ ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజే ఇంగ్లాండ్ జట్టు 205కి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి స్పిన్ పిచ్ వాడటం వల్లే ఇంగ్లాండ్ జట్టు త్వరగా పెవీలియన్‌కు చేరుకుందనే విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కొట్టి పడేస్తున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పైన కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విఫలమవడం వారి చెత్త బ్యాటింగ్‌కు నిదర్శనమని వాన్ అన్నాడు. బంతి చక్కగా బ్యాట్‌ […]

Update: 2021-03-04 09:08 GMT

దిశ, స్పోర్ట్స్: అహ్మదాబాద్‌లో టీమ్ ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజే ఇంగ్లాండ్ జట్టు 205కి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మరోసారి స్పిన్ పిచ్ వాడటం వల్లే ఇంగ్లాండ్ జట్టు త్వరగా పెవీలియన్‌కు చేరుకుందనే విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కొట్టి పడేస్తున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పైన కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విఫలమవడం వారి చెత్త బ్యాటింగ్‌కు నిదర్శనమని వాన్ అన్నాడు. బంతి చక్కగా బ్యాట్‌ పైకి వస్తున్నదని.. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ వాటిని సరిగా ఆడలేక వికెట్లు పారేసుకున్నారని అన్నాడు. భారత జట్టు స్పిన్నర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని వాన్ ప్రశంసలు కురిపించాడు. కాగా మూడో టెస్టు అనంతరం పిచ్ చాలా అధ్వాన్నంగా ఉన్నదని.. దానికి నాగలితో దున్ననట్లు ఉన్నదని వాన్ దుమ్మెత్తిపోయడం గమనార్హం. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నదని అన్నాడు. బ్యాట్స్‌మాన్ నిలదొక్కుకుంటే పరుగులు సాధించడం కష్టమేమీ కాదని అన్నాడు.

Tags:    

Similar News