ఫిఫా యూ-17 ఉమెన్స్ వరల్డ్ కప్‌కు 3 జట్లు అర్హత

దిశ, స్పోర్ట్స్: ఇండియా వేదికగా 2021లో జరగనున్న ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్‌ (FIFA Under-17 Women’s World Cup)కు మూడు జట్లు (Three teams) అర్హత సాధించినట్లు స్థానిక నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వరల్డ్ కప్ (World Cup) అర్హత కోసం నిర్వహించాల్సిన యూరోప్ రీజియన్ మ్యాచ్‌లు (Europe Region Matches) కరోనా కారణంగా రద్దవడంతో ప్రస్తుత ర్యాంకుల ఆధారంగా ఇంగ్లాండ్, జర్మనీ జట్లు అర్హత సాధించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక […]

Update: 2020-08-14 10:39 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియా వేదికగా 2021లో జరగనున్న ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్‌ (FIFA Under-17 Women’s World Cup)కు మూడు జట్లు (Three teams) అర్హత సాధించినట్లు స్థానిక నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వరల్డ్ కప్ (World Cup) అర్హత కోసం నిర్వహించాల్సిన యూరోప్ రీజియన్ మ్యాచ్‌లు (Europe Region Matches) కరోనా కారణంగా రద్దవడంతో ప్రస్తుత ర్యాంకుల ఆధారంగా ఇంగ్లాండ్, జర్మనీ జట్లు అర్హత సాధించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇక డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్‌ (Defending champion Spain)కూ అర్హత లభించింది. దీంతో వరల్డ్ కప్ ఆడబోయే మొత్తం జట్ల వివరాలు స్పష్టంగా తెలిసిపోయాయి. ఆతిథ్య జట్టు ( host team) హోదాలో ఇండియాతోపాటు ఇప్పటికే అర్హత సాధించిన ఉత్తర కొరియా, జపాన్, న్యూజీలాండ్‌లతో స్పెయిన్, ఇంగ్లాండ్, జర్మనీ జట్లు జత కలవనున్నాయి. కొవిడ్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సిన వరల్డ్ కప్‌ను 2021 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం (DY Patil Stadium)లో నిర్వహించనున్నారు.

Tags:    

Similar News