కరోనా ఎఫెక్ట్.. వన్డే మ్యాచ్ వాయిదా

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య కేప్‌టౌన్‌లో జరగాల్సిన తొలి వన్డేను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఇరు జట్లు మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కావల్సి ఉన్నది. కాగా, మ్యాచ్‌కు ముందు రోజు జరిపిన కరోనా పరీక్షల్లో ఓ దక్షిణాఫ్రికా ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మ్యాచ్ వాయిదా వేసింది. ఇతర ఆటగాళ్ల ఆరోగ్యాలపై ప్రభావం చూపకూడదనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు […]

Update: 2020-12-04 11:35 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య కేప్‌టౌన్‌లో జరగాల్సిన తొలి వన్డేను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఇరు జట్లు మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కావల్సి ఉన్నది. కాగా, మ్యాచ్‌కు ముందు రోజు జరిపిన కరోనా పరీక్షల్లో ఓ దక్షిణాఫ్రికా ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మ్యాచ్ వాయిదా వేసింది. ఇతర ఆటగాళ్ల ఆరోగ్యాలపై ప్రభావం చూపకూడదనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణాఫ్రికా తాత్కాలిక సీఈవో కుగాండ్రి గోవెందర్, ఈసీబీ సీఈవో టామ్ హారిసన్ ప్రకటించారు. ప్రస్తుతం కరోనా సోకిన ఆటగాడిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వారు వెల్లడించారు. శుక్రవారం వాయిదా వేసిన మ్యాచ్‌ను ఆదివారం నిర్వహిస్తామని, రెండో వన్డే సోమవారం ఉంటుదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.

Tags:    

Similar News