టీ20 వార్.. భారత్‌కు బౌలర్ల కొరత.. పటిష్టంగా ఇంగ్లాండ్

దిశ, స్పోర్ట్స్ : వరుసగా టెస్టు సిరీస్ విజయాలు సాధించి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చేరుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు గేర్ మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. నిలకడకు, ఓపికకు చెల్లచీటీ పాడేసి.. దూకుడుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చింది. బంతిని డిఫెన్స్ ఆడటం మానేసి.. బౌండరీలకు తరలించాల్సిన ఫార్మాట్ మొదలు కాబోతున్నది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో గెల్చిన టీమ్ ఇండియా.. రెండున్నర నెలల తర్వాత మళ్లీ టీ20 మ్యాచ్‌లు ఆడబోతున్నది. మధ్యలో 8 […]

Update: 2021-03-10 08:16 GMT

దిశ, స్పోర్ట్స్ : వరుసగా టెస్టు సిరీస్ విజయాలు సాధించి ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చేరుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు గేర్ మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. నిలకడకు, ఓపికకు చెల్లచీటీ పాడేసి.. దూకుడుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం వచ్చింది. బంతిని డిఫెన్స్ ఆడటం మానేసి.. బౌండరీలకు తరలించాల్సిన ఫార్మాట్ మొదలు కాబోతున్నది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో గెల్చిన టీమ్ ఇండియా.. రెండున్నర నెలల తర్వాత మళ్లీ టీ20 మ్యాచ్‌లు ఆడబోతున్నది. మధ్యలో 8 టెస్టులు ఆడిన టీమ్ ఇండియా.. ఇక ధనాధన్ క్రికెట్‌ ఆడబోతున్నది. శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలు కానున్నది. అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలోనే జరుగనున్నాయి. ఇంగ్లాండ్ జట్టులో మేటి టీ20 ఆటగాళ్లతో కూడి ఉండగా.. భారత జట్టు మాత్రం కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో కాస్త ఇబ్బంది పడుతున్నది.

ఫిట్‌నెస్ ఇబ్బందులు..

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ముందు టీమ్ ఇండియా పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నది. ఆస్ట్రేలియాలో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన నటరాజన్‌ను ఇంగ్లాండ్ సిరీస్‌కి కూడా ఎంపిక చేశారు. అయితే గాయం కారణంగా ప్రస్తుతం నటరాజన్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కోసం నట్టూ.. అక్కడ సాధన చేస్తున్నట్లు ఎన్ఏసీ ప్రకటించింది. కానీ అతడి గాయం తీవ్రత ఎంత.. ఎప్పుడు జట్టుతో చేరడాడనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు బీసీసీఐ ఇటీవలే ప్రవేశపెట్టిన కొత్త ఫిట్‌నెస్ నిబంధనలు రాహుల్ తెవాతియా, వరుణ్ చక్రవర్తికి అడ్డంకిగా మారాయి. వరుణ్ రెండు సార్లు ఈ పరుగు పరీక్షలో విఫలం కాగా, రాహుల్ తెవాతియాకు మరో అవకాశం ఉన్నది. భారత జట్టు కీలక బౌలర్ జస్ప్రిత్ బుమ్రా సెలవులో ఉండటంతో పేస్ విభాగంలో కొరతను నటరాజన్ తీరుస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. కానీ ఇప్పుడు నటరాజన్ అందుబాటులో లేకపోవడంతో బౌలింగ్‌లో సమన్వయానికి ఇతర ఆప్షన్లను వెతుకుతున్నది. కోహ్లీ, రోహిత్, శిఖర్ అందుబాటులో ఉంటారు. అయితే కేఎల్ రాహుల్ ఏ స్థానంలో దిగుతాడనే దానిపై సందిగ్దత నెలకొన్నది. ఇక మిడల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, పంత్ ఆడుతుండటంతో బలంగా కనిపిస్తున్నది. అయితే ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న భువనేశ్వర్‌కుమార్ ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి. అతడికి తోడుగా చాహర్ లేదా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చేసే అవకాశం ఉన్నది.

పటిష్టంగా ఇంగ్లాండ్ జట్టు..

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉన్నది. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉన్నది. టీ20 టాప్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ మలన్, 10వ ర్యాంకర్ ఇయాన్ మోర్గాన్, టాప్ 5 బౌలర్ ఆదిల్ రషీద్‌తో పాటు జాస్ బట్లర్, జేసన్ రాయ్, బెన్‌స్టోక్స్ వంటి క్రికెటర్లతో బలంగా ఉన్నది. జానీ బెయిర్ స్టో ఈ మధ్య పూర్తిగా విఫలమవుతుండటం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అని విశ్లేషకులు అంటున్నారు. జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా టీ20లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరు బౌలింగ్ చేస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సామ్ బిల్లింగ్స్, సామ్ కర్రన్, మొయిన్ అలీ బౌలింగ్‌తో పాటు బ్యాటుతో కూడా రాణించగలరు. అయితే అహ్మదాబాద్‌లోని మొతేరా పిచ్ ఎలా స్పందిస్తుందనేదానిపై ఇరు జట్ల విజయావకాశాలు ఉన్నాయి. టెస్టులకు వాడిన పిచ్‌లు కాకుండా పూర్తిగా కొత్త పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కూడా స్పష్టం చేసింది.

Tags:    

Similar News