తెరుచుకున్న యాదాద్రి ఆలయం

దిశ, నల్లగొండ: సూర్యగ్రహణం ముగియడంతో యాదాద్రి ఆలయాన్ని అర్చకులు తెరిచారు. ఆలయంలో శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం పూజల నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఆదివారం ‘త్రిపాద రాహుగ్రస్త’ సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఎక్కువ నిడివి కలిగినది కూడా ఇదే కావడం గమనార్హం. ఉదయం 10.14గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1.49 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు దేవాలయాలన్నిటినీ […]

Update: 2020-06-21 06:43 GMT

దిశ, నల్లగొండ: సూర్యగ్రహణం ముగియడంతో యాదాద్రి ఆలయాన్ని అర్చకులు తెరిచారు. ఆలయంలో శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం పూజల నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఆదివారం ‘త్రిపాద రాహుగ్రస్త’ సూర్యగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఎక్కువ నిడివి కలిగినది కూడా ఇదే కావడం గమనార్హం. ఉదయం 10.14గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1.49 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు దేవాలయాలన్నిటినీ మూసివేశారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సంప్రోక్షణ, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు దాని అనుబంధ దేవాలయాల్లో ఈ రోజు భక్తులకు దర్శనం కల్పిస్తారు.

Tags:    

Similar News