ఉద్యోగులు ఉత్తమ సేవలు అందించాలి : సీఎస్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టించి పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. సెక్రటేరియట్‌లోని 122 మంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ సీఎస్‌ను బీఆర్కే భవన్లో ఘనంగా సన్మానించింది. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని, తద్వారా సామాన్యులకు ఉత్తమ సేవలు అందుతాయన్నారు. సీఎం ఆదేశాలతో అన్నిశాఖల్లోని ఉద్యోగులందరికీ ప్రమోషన్ డ్రైవ్ నిర్వహించామని చెప్పారు. గతంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టించి పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. సెక్రటేరియట్‌లోని 122 మంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ సీఎస్‌ను బీఆర్కే భవన్లో ఘనంగా సన్మానించింది. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని, తద్వారా సామాన్యులకు ఉత్తమ సేవలు అందుతాయన్నారు. సీఎం ఆదేశాలతో అన్నిశాఖల్లోని ఉద్యోగులందరికీ ప్రమోషన్ డ్రైవ్ నిర్వహించామని చెప్పారు.
గతంలో ప్రమోషన్ల ప్రక్రియ మూడు సంవత్సరాలు దాటితేనే కొనసాగేదని, కానీ ఇప్పుడు దాన్ని రెండేండ్లకు తగ్గించామన్నారు. రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారందరికీ ప్రమోషన్లు లభిస్తాయని చెప్పారు. ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు హ్యూమన్ రీసోర్స్ ద్వారా శిక్షణ ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.