ఆలయాన్నే బార్‌గా మార్చిన సిబ్బంది..
దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు కొందరు ఆలయ సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆలయాన్ని మూసివేసి కేవలం అత్యవసర పూజలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రాంగణంలో ఓ ఇద్దరు సిబ్బంది మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విరుదచలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. విరుదచలంలోని శ్రీ కొలన్ జీయాప్పర్ ఆలయంలో ప్రస్తుతం అత్యవసర పూజలు మాత్రమే సాగుతున్నాయి. ఆ సమయంలో […]
దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు కొందరు ఆలయ సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆలయాన్ని మూసివేసి కేవలం అత్యవసర పూజలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రాంగణంలో ఓ ఇద్దరు సిబ్బంది మద్యం సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విరుదచలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
విరుదచలంలోని శ్రీ కొలన్ జీయాప్పర్ ఆలయంలో ప్రస్తుతం అత్యవసర పూజలు మాత్రమే సాగుతున్నాయి. ఆ సమయంలో పూజారులు, కొందరు సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఆదివారం ఆలయంలోని నందనవనంలో ఇద్దరు సిబ్బంది మద్యం సేవించడమే కాకుండా, మాంసాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.
ఈ ఘటనపై దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. మద్యం సేవించిన వ్యక్తులను పులవార్ శివరాజన్, వాచ్‌మెన్ శివకుమార్‌గా గుర్తించారు. వీరిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. ఇదిలావుంటే, ఈ ఆలయంపై గతంలోనూ పలు ఆరోపణలు వెలుగుచూశాయి. ఆలయ ప్రాంగణంలో ఉండే 9 మచ్చల జింకలు అనుమానాస్పదంగా మృతిచెందాయి. ఆలయ పరిపాలన విభాగం మొత్తం 21 మచ్చల జింకలను పెంచుతోంది. అలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.