పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వాలని నిరసన

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో గత మూడు నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోత పెట్టడాన్ని నిరసిస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 12.00 వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు, పెన్షనర్లు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు, నల్ల బ్యాడ్జీలు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. వేతనాలు, పెన్షన్లలో కోతలను నిర్దేశించిన జిఓ నెంబర్ 27 రద్దు చేయాలని, మార్చి […]

Update: 2020-06-01 09:43 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో గత మూడు నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లలో కోత పెట్టడాన్ని నిరసిస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 12.00 వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు, పెన్షనర్లు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు, నల్ల బ్యాడ్జీలు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. వేతనాలు, పెన్షన్లలో కోతలను నిర్దేశించిన జిఓ నెంబర్ 27 రద్దు చేయాలని, మార్చి నెలనుండి కోతపెట్టిన వేతనాలు, పింఛన్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఐక్యవేదిక నాయకులు జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పించారు.

Tags:    

Similar News