పబ్లిక్ సెక్టార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆవిర్భావం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భవించింది. కార్పొరేషన్లలో పదవీ విరమణ పొందిన వారంతా సంఘంగా ఏర్పడ్డారు. ఉద్యోగుల సమస్యలు, ఆరోగ్య పథకం అమలు, పెన్షన్ సాధన, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కోసం సంఘం పని చేయనుంది. సంఘానికి నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు బాసబత్తిని రాజేశం తెలిపారు. సంఘం అధ్యక్షులుగా బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శిగా దొంత ఆనందం, సహాధ్యక్షులుగా రఘుపతి రావు, జేవీఎల్నర్సింహారావు, […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భవించింది. కార్పొరేషన్లలో పదవీ విరమణ పొందిన వారంతా సంఘంగా ఏర్పడ్డారు. ఉద్యోగుల సమస్యలు, ఆరోగ్య పథకం అమలు, పెన్షన్ సాధన, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కోసం సంఘం పని చేయనుంది. సంఘానికి నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు బాసబత్తిని రాజేశం తెలిపారు.
సంఘం అధ్యక్షులుగా బాసబత్తిని రాజేశం, ప్రధాన కార్యదర్శిగా దొంత ఆనందం, సహాధ్యక్షులుగా రఘుపతి రావు, జేవీఎల్నర్సింహారావు, కోశాధికారి నాగరాజు, ముఖ్య సలహాదారులుగా సుధీర్ బాబు, విజయ్ మోహన్, లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా చంద్రశేఖర్, శోభారాణి, వెంకటేశ్వర్లు, మాజీదుద్దీన్, ఇక్బాల్ ఎన్నికయ్యారు.