గర్ల్స్ హాస్టల్ లో దారుణం.. బాత్రూంలో అలా చేశారని బట్టలు విప్పి, అక్కడ చెక్ చేసి

దిశ, వెబ్‌డెస్క్: ఏళ్ల నాటి నుంచి ఆడవారిని సమాజం చిన్నచూపు చూస్తూనే ఉంది. ఒకపక్క మహిళలకు పట్టం కడుతున్నామని అంటూనే.. మరోపక్క వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో సమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకొంది. గర్ల్స్ హాస్టల్ లోని పలువురు నీచానికి ఒడిగట్టారు. బాత్ రూమ్ ని క్లీన్ చేయకుండా వచ్చింది ఎవరని అమ్మాయిలందరిని నగ్నంగా నిలబెట్టి తనీఖీలు చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి […]

Update: 2021-10-01 02:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏళ్ల నాటి నుంచి ఆడవారిని సమాజం చిన్నచూపు చూస్తూనే ఉంది. ఒకపక్క మహిళలకు పట్టం కడుతున్నామని అంటూనే.. మరోపక్క వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో సమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకొంది. గర్ల్స్ హాస్టల్ లోని పలువురు నీచానికి ఒడిగట్టారు. బాత్ రూమ్ ని క్లీన్ చేయకుండా వచ్చింది ఎవరని అమ్మాయిలందరిని నగ్నంగా నిలబెట్టి తనీఖీలు చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే.. కిథోర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురిని మీరట్‌లోని ఓ కాలేజీలో చేర్పించాడు. ఆ కాలేజ్ కి దగ్గర్లోనే ఒక హాస్టల్ లో కూతురిని చేర్చాడు. హాస్టల్ బావుంది అని తెలియడంతో కొద్దిరోజుల తర్వాత అదే హాస్టల్ లో ఇంటర్ చదువుతున్న తన మేనకోడలిని కూడా జాయిన్ చేశాడు. ఒకరికొకరు తోడుగా ఉండే వారిద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం మేనకోడలికి నెలసరి వచ్చింది. దీంతో ఆమె బాత్ రూమ్ కి వెళ్లింది. బహిష్టు కారణంగా రక్తస్రావం అయింది. ఆ యువతి బాత్రూమ్‌లోకి వెళ్లిన సందర్భంలో బాత్ రూమ్ లో నీళ్లు రావడం లేదు. చేసేది ఏమి లేక యువతి అలాగే బయటికి వచ్చేసింది.

ఇది గమనించిన హాస్టల్ యాజమాన్యం సీరియస్ అయ్యింది. బాత్ రూమ్ ని అపరిశుభ్రంగా ఉంచింది ఎవరు అంటూ మండిపడింది. ఎవరు చెప్పకపోవడంతో దారుణానికి పాల్పడ్డారు. ఎవరు నెలసరిలో ఉన్నారో తెలుసుకోవడానికి అమ్మాయిలందరి లో దుస్తులను తొలగించి తనీఖీలు చేశారు. ఈ ఘటనతో బాధిత యువతి మానసికంగా తీవ్ర మనోవేదనకు గురయ్యి అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుడికి జరిగింది చెప్పడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఘటనపై బాధిత యువతి తల్లిదండ్రులు మీరట్ ఎస్‌ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ తరహా ఫిర్యాదు రావడం ఇదే తొలిసారి అని మీరట్ ఎస్‌ఎస్పీ ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన హాస్టల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News