పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి
దిశ, ఎల్బీనగర్: పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొప్పుల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ భీమిడి రామకృష్ణారెడ్డి, చంపాపేట డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డిలు చంపాపేట డీఈ, ఆటో నగర్ ఏఈలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడిన ఆ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రియేనా […]
దిశ, ఎల్బీనగర్: పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొప్పుల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ భీమిడి రామకృష్ణారెడ్డి, చంపాపేట డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డిలు చంపాపేట డీఈ, ఆటో నగర్ ఏఈలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడిన ఆ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రియేనా లేక వడ్డీల వ్యాపారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఒకవైపు పనులు దొరక్క అల్లాడుతుంటే, మరోవైపు విద్యుత్ బిల్లుల పెంపుతో ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వినతి ప్రతం ఇచ్చిన వారిలో మన్సురాబాద్ డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకుడు పుట్ట వెంకటేష్, చంపాపేట డివిజన్ నాయకులు సునీల్ కుమార్, వెంకట్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.