విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం

విద్యుత్‌ సంస్థలు బతకాలంటే చార్జీలు పెంపు అనివార్యమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్ను పెంచాలని, అయితే నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాకే పెంపు వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో పల్లెప్రగతి పై జరిగిన స్వల్పకాలిక చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘ప్రజలు మాపై విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారు. ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుకునేలా పాలన కొనసాగిస్తున్నాం’ అని అన్నారు. గ్రామాలు బాగుపడాలంటే […]

Update: 2020-03-13 03:10 GMT

విద్యుత్‌ సంస్థలు బతకాలంటే చార్జీలు పెంపు అనివార్యమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్ను పెంచాలని, అయితే నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాకే పెంపు వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీలో పల్లెప్రగతి పై జరిగిన స్వల్పకాలిక చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘ప్రజలు మాపై విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారు. ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుకునేలా పాలన కొనసాగిస్తున్నాం’ అని అన్నారు. గ్రామాలు బాగుపడాలంటే ప్రజా సహకారంతోనే సాధ్యమవుతుందని, ప్రతి పంచాయతీకి ఐదు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే మార్గాలను చూపించామని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.

tag; cm kcr, assembly, power companies, electric charges hike

Tags:    

Similar News