ఎకో ఫ్రెండ్లీ బైక్ @రూ.50 వేలు

దిశ, వెబ్‌డెస్క్ : కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం కారణంగా జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు పర్యావరణహిత ఉత్పత్తులు తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఎన్విరాన్‌మెంట్‌‌ను ఎఫెక్ట్ చేయకుండా ఉండే ప్రొడక్ట్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ బుల్లి.. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ (బైక్)‌ను రూపొందించింది. దాన్ని డ్రైవ్ చేసేందుకు లైసెన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. అంతర్జాతీయ ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థ […]

Update: 2021-01-05 03:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం కారణంగా జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు పర్యావరణహిత ఉత్పత్తులు తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఎన్విరాన్‌మెంట్‌‌ను ఎఫెక్ట్ చేయకుండా ఉండే ప్రొడక్ట్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ బుల్లి.. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ (బైక్)‌ను రూపొందించింది. దాన్ని డ్రైవ్ చేసేందుకు లైసెన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. అంతర్జాతీయ ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థ (ICAT), ఈ బైక్‌ను లో స్పీడ్(అతి తక్కువ వేగమున్న) మోటార్ సైకిల్‌గా సర్టిఫై చేసింది. అయితే ఈ బైక్ తయారుచేసేందుకు సంస్థకు ఎంత సమయం పట్టింది? బైక్ ధర, మ్యాగ్జిమమ్ స్పీడ్ లిమిట్‌తో పాటు మార్కెట్‌లో రిలీజ్ ఎప్పుడు? వంటి విషయాలు మీ కోసం..

హైదరాబాద్‌కు చెందిన వంశీ గడ్డం.. 2011లో బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, తమ ఫ్యామిలీ బిజినెస్ అయిన విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెట్‌లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. సస్టెయినబుల్ ప్రొడక్ట్స్‌పై కొద్దిరోజుల పాటు పరిశోధన చేసిన తను.. మొదట ఆటమ్(ATUM) పేరుతో సోలార్-ప్యానల్ ఇంటిగ్రేటెడ్ రూఫింగ్ సిస్టమ్ రూపొందించాడు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహిక‌ల్స్‌కు మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను చూసి.. తన టీమ్‌తో కలిసి ఎలక్ట్రిక్ బైక్ తయారీకి పూనుకున్నారు.

వంశీతో పాటు ఆయన టీమ్‌లోని పది మంది ఇంజినీర్లు కలిసి ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ రూపొందించగా.. దానికి ఫైనల్ అప్రూవల్స్‌, స్పెసిఫికేషన్స్ వెరిఫికేషన్, టెస్టింగ్‌కు మూడేళ్ల సమయం పట్టింది. ‘ఆటమ్ 1.0(ATUM 1.0)’ పేరుతో రూపొందించిన ఈ బైక్ బరువు 35 కిలోలు. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. బైక్‌కు 48 వోల్టుల విద్యుత్ అవసరమని, 250 వాట్ల లిథియమ్ బ్యాటరీని బ్యాకప్‌తో ఒకసారి చార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చని సంస్థ వెల్లడించింది. కాగా భారతీయ రోడ్లకు సరిపోయేలా ‘ఆటమ్ 1.0’ను రూపొందించారని, బైక్ టైర్లు దృఢంగా ఉన్నాయని యూట్యూబర్ ప్రకాశ్ చౌదరి చెప్పారు. డిజైన్ కొంచెం కొత్తగా ఉందని, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు 300 బైకులు బుక్ అయ్యాయని తెలిపారు. స్టైలిష్‌లుక్‌తో ఉండే ఈ ‘ఆటమ్ 1.0’ ధర రూ.50 వేలని చెప్పారు. కస్టమర్లు తమ Atumobile’s పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ బైక్‌ను బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Tags:    

Similar News