నేడు గ్రేటర్ నామినేషన్ల పరిశీలన
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నేడు నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల గడువు శుక్రవారం ముగిసింది. నిన్నటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నామినేషన్లు ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ఠుల తుది జాబితాను ప్రకటించనున్నారు. గ్రేటర్ లో మొత్తం 150 వార్డులకు గాను 2,602 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 1,937 అభ్యర్థులు […]
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నేడు నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల గడువు శుక్రవారం ముగిసింది. నిన్నటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నామినేషన్లు ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ఠుల తుది జాబితాను ప్రకటించనున్నారు.
గ్రేటర్ లో మొత్తం 150 వార్డులకు గాను 2,602 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 1,937 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపీ-571, టీఆర్‌ఎస్- 557, కాంగ్రెస్-372, మజ్లిస్-78, టీడీపీ-206, సీపీఐ-21, సీపీఎం-22, గుర్తింపు పొందిన ఇతర పార్టీలు- 115, స్వతంత్రుల నుంచి 650 నామినేషన్లు దాఖలయ్యాయి.