ఎన్నికల సరళిని పరిశీలించిన శశాంక్ గోయల్

దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నికల సరళిని ఎన్నికల సీఈఓ శశాంక్ గోయల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరిలు పరిశీలించారు. ఈ సందర్భంగా లచ్చపేటలోని స్ట్రాంగ్‌రూమ్ సందర్శించారు. అనంతరం ఓటర్ టర్న్ ఔట్ టీమ్‌తో చర్చించి పోలింగ్‌శాతం నివేదికలు పంపుతున్న తీరుపై ఆరా తీశారు. అంతేగాకుండా స్ట్రాంగ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ బోర్డులో పోలింగ్ కేంద్రాల వారిగా నియోజకవర్గ పరిధిలోని 104 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.

Update: 2020-11-03 06:21 GMT

Tags:    

Similar News