అద్దె భవనాల్లో ఏకలవ్య పాఠశాలలు.. నాణ్యత లేని భోజనం
దిశ, భద్రాచలం అర్బన్: విద్యార్థి యువజన సంకల్పన సమితి (వీవైఎస్ ఎస్) ఆధ్వర్యంలో స్థానిక ఏకలవ్య పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వీవైఎస్‌ఎస్ నాయకులు గుమ్మడి రాజు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 7 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని, ఏ ఒక్క పాఠశాలకు కూడా సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో నడుపుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల భోజనం, టిఫిన్ విషయంలో విషయంలో నాణ్యత వహించి పౌష్టికాహారం అందించాలని అన్నారు. […]
దిశ, భద్రాచలం అర్బన్: విద్యార్థి యువజన సంకల్పన సమితి (వీవైఎస్ ఎస్) ఆధ్వర్యంలో స్థానిక ఏకలవ్య పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వీవైఎస్‌ఎస్ నాయకులు గుమ్మడి రాజు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 7 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని, ఏ ఒక్క పాఠశాలకు కూడా సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో నడుపుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల భోజనం, టిఫిన్ విషయంలో విషయంలో నాణ్యత వహించి పౌష్టికాహారం అందించాలని అన్నారు. ఉన్నత విద్యాశాఖాధికారులు దృష్టి సారించి అద్దె భవనాల్లో ఉన్న ఏకలవ్య పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు అండగా వీవైఎస్‌ఎస్ నిరంతరం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీవైఎస్ఎస్ నాయకులు రమణ,క్రాంతి,శివ,విష్ణు,భరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.