60 ఏండ్ల వృద్దులకు సహాయం అందించేందుకు కృషి
దిశ, సిద్దిపేట: 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏలాంటి సాయం అందించాలన్న అంశంపై సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామం దమ్మ చెరువులో 56 సామూహిక గృహా ప్రవేశాలలో హాజరై లబ్ధిదారులను గృహా ప్రవేశాలు చేయించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. అనంతరం నూతన గృహా లబ్ధిదారులకు ఇళ్ల […]
దిశ, సిద్దిపేట: 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏలాంటి సాయం అందించాలన్న అంశంపై సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామం దమ్మ చెరువులో 56 సామూహిక గృహా ప్రవేశాలలో హాజరై లబ్ధిదారులను గృహా ప్రవేశాలు చేయించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. అనంతరం నూతన గృహా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
చింతమడక-దమ్మచెరువుకు కాళేశ్వరం నీళ్లు వచ్చినయ్.. కొత్త ఇళ్లు వచ్చి గృహా ప్రవేశాలు జరుపుకున్నామని, చింతమడకతో ప్రారంభమైన యజ్ఞం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు.దమ్మచెరువులో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూస్తే కడుపు నిండినంత సంతోషంగా ఉందన్నారు. చింతమడక-దమ్మచెరువు మిగులు పనులు, మరింత లబ్ధిదారులకు రావాల్సిన నిధుల విషయమై వారంలో పరిష్కారం చేయిస్తానని మంత్రి భరోసానిచ్చారు. చింతమడక-దమ్మచెరువు గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్, బడి, అంగన్ వాడీ, బస్ షెల్టర్, నర్లేoడ గడ్డ రోడ్డును త్వరలోనే వేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.