యూపీలో 31వరకు విద్యాసంస్థలు బంద్
లక్నో: యూపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగిసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను ఏప్రిల్ 31వరకు తాత్కాలికంగా మూసి వేయాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థలతో పాటు కోచింగ్ సెంటర్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అయితే ముందస్తుగా షెడ్యూల్ ప్రకటించిన కొన్ని పరీక్షలను మాత్రం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.