TGPSC:గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పటినుంచంటే?

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది.

Update: 2024-06-17 02:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి, ప్రిలిమ్స్ కీ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్‌పీఎస్సీ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్-4కు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఎవరైనా గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 31 తేదీల్లో పరిశీలిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 8,130 పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు పోటీ పడుతున్నారు. 

గ్రూప్‌-4 అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9న రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పీడ‌బ్ల్యూడీ అభ్యర్థుల‌ను 1:5 నిష్పత్తిలో పిల‌వ‌నున్నారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. కమ్యూనిటీ, నాన్‌ క్రిమిలేయర్, స్టడీ సర్టిఫికేట్స్(1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు), రిజర్వేషన్‌ కలిగి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఏజ్ రిలాక్సేష‌న్, క్వాలిఫికేష‌న్ స‌ర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచిచింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఏ సర్టిఫికెట్ లేకున్నా రిజెక్ట్ అవుతారని తెలిపింది.


Similar News