జాబ్ vs బిజినెస్ ఏది బెస్ట్? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే?

చాలా మందికి చదువు పూర్తి అవ్వగానే చాలా సందేహలు వస్తాయి. జాబ్ చేయాలా? బిజినెస్ పెట్టాలా? అన్న ప్రశ్న యూత్‌ను వేధిస్తుంటుంది. ఈ కన్ఫ్యూజన్‌లో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు.

Update: 2024-05-31 15:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: చాలా మందికి చదువు పూర్తి అవ్వగానే చాలా సందేహలు వస్తాయి. జాబ్ చేయాలా? బిజినెస్ పెట్టాలా? అన్న ప్రశ్న యూత్‌ను వేధిస్తుంటుంది. ఈ కన్ఫ్యూజన్‌లో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అటువంటప్పుడు అనుభవం ఉన్న నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదంటున్నారు. అయితే వీటిలో ఏదో ఒకదానికి ఫిక్స్ అయ్యే ముందు ఏయే రంగంలో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. చదువు పూర్తవ్వగానే కొందరు తాము చేసిన కోర్సుకి తగిన ఉద్యోగాల్లో చేరిపోతారు. మరికొందరైతే ఏదైనా స్టార్టప్ పెట్టాలని ఆలోచిస్తారు. ఈ నేపథ్యంలో బిజినెస్ అండ్ జాబ్ ఈ రెండింటిలో ఏ ఆప్షన్ ఎవరికి సూట్ అవుతుంది? వీటిలో ఉండే లాభానష్టాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జాబ్..

స్టడీ పూర్తవ్వగానే చాలామంది ఎంచుకునే ఆప్షన్‌ జాబ్. ఉద్యోగంలో సేఫ్టీ ఉంటుంది. కెరీర్ పరంగా అప్‌డేట్ అవుతూ, సంపాదన పెంచుకుంటే మెల్లగా జీవితంలో రాణించొచ్చు. కంఫర్ట్, సేఫ్టీ కోరుకునేవాళ్లు జాబ్‌కు ఓటేయడం మేలు అంటున్నారు నిపుణులు. ఉద్యోగం ఒక రకమైన మనస్తత్వానికి సూట్ అవుతుంది. అందులో కూడా కెరీర్‌‌కు బోలెడు స్కోప్ ఉంటుందనే చెబుతున్నారు. ఉద్యోగంలో రాణిస్తూ కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. రిస్క్ తీసుకోకుండా కేవలం స్కిల్స్‌పై ఫోకస్ పెట్టేవారికి ఉద్యోగం మంచి ఆప్షన్ అవుతుందనేది నిపుణుల సలహా.

బిజినెస్..

బిజినెస్ విషయానికొస్తే రిస్క్ ఉన్నా పర్లేదు నలుగురిలా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలి అనుకునేవాళ్లు బిజినెస్ ట్రై చేయొచ్చు. అయితే ఇందులో ప్రధానంగా ఉండేది రిస్క్. మీ ఆలోచన వర్కవుట్ అవ్వకపోతే డబ్బుతో పాటు సమయం కూడా వృధా అయ్యే ఛాన్స్ ఉంది. మీ దగ్గర కొత్త ఐడియాలు ఉండి దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయగల స్ట్రాటెజీ, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే అప్పుడు బిజినెస్ మంచి ఆప్షన్ అవుతుంది.

ఒకసారి బిజినెస్‌లో నష్టపోతే కెరీర్‌‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అయితే పెద్ద మొత్తాల్లో అప్పు చేసి బిజినెస్ చేయడం మాత్రం అంత మంచి ఆలోచన కాదు, రిస్క్‌ను బేరీజు వేసుకున్నాకే బిజినెస్‌లో దిగాలనేది నిపుణుల సలహా. కాబట్టి మీ మనస్తత్వాన్ని, మీ స్కిల్స్‌ను బట్టి ఎంపిక చేసుకోవాలి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఒకదాన్ని తక్కువగా మరోదాన్ని గొప్పదానిగా చూడడం మానుకోవాలనేది నిపుణులు చెప్పే మాట.


Similar News