BREAKING: ఏపీ ఓపెన్ టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

ఏపీ ఓపెన్ టెన్త్ పరీక్షలు(AP Open Tenth Exams) ఈ నెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

Update: 2025-03-09 08:05 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ఓపెన్ టెన్త్ పరీక్షలు(AP Open Tenth Exams) ఈ నెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఓపెన్ టెన్త్ పరీక్షల హాల్‌టికెట్లు(Hall Tickets) విడుదలయ్యాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్(Whatsapp Number) లేదా స్టడీ కేంద్రాల ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

APOSS టెన్త్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ విధానం..

*విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/index.aspx#లోకి వెళ్లాలి.

*హోంపేజిలో హాల్‌టికెట్ ఆప్షన్ కనిపిస్తోంది. ఇక్కడ SSC, ఇంటర్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. మీరు SSC ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

*కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ జిల్లా, స్కూల్, విద్యార్థి పేరును నమోదు చేయాలి.

*తర్వత హాల్‌టికెట్ డౌన్‌లోడ్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.

*మీ హాల్‌టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇక ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

*ఈ హాల్‌టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. విద్యార్థులు వాట్సప్ నెంబర్ 9552300009కి HI అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత సర్వీసును ఎంపిక చేసుకొని హాల్ టికెట్ పొందవచ్చు.

*పరీక్ష తేదీలు

మార్చి 17-హిందీ

మార్చి 19-ఇంగ్లీష్

మార్చి 21-తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ

మార్చి 24-గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వం

మార్చి 26-సాంకేతిక విజ్ఞాన శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం

మార్చి 28-సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం

Tags:    

Similar News