APPSC: ముగిసిన FRO స్క్రీనింగ్ టెస్ట్.. ఎంత మంది హాజరయ్యారంటే?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష) నేడు(ఆదివారం) 13 జిల్లా కేంద్రాలలో నిర్వహించారు.

Update: 2025-03-16 09:48 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష) నేడు(ఆదివారం) 13 జిల్లా కేంద్రాలలో నిర్వహించారు. మార్చి 6న ఒక ప్రకటనలో, కమిషన్ కార్యదర్శి ఐఎన్ మూర్తి మార్చి 10వ తేదీ నుంచి కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయని తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ(Forest Department)లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్(FRO) పోస్టుల భర్తీకి ఇవాళ(ఆదివారం) నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. 70.85శాతం హాజరు నమోదైందని వెల్లడించింది. ఈ పరీక్ష కోసం 15,308 మంది దరఖాస్తు చేసుకోగా, 10,755 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది. 7,620 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొంది.

Tags:    

Similar News