తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదల

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన టెట్ (టీచర్ ఎలిజిబిల్టీ టెస్ట్) పరీక్ష ప్రాథమిక కీ విడుదల అయింది.

Update: 2024-06-03 14:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన టెట్ (టీచర్ ఎలిజిబిల్టీ టెస్ట్) పరీక్ష ప్రాథమిక కీ విడుదల అయింది. మే 20 నుంచి జూన్ 2 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. పేపర్ 1కి 86.03 శాతం మంది, పేపర్-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు. జూన్ 3 నుంచి 5 వరకు అధికారిక వెబ్ సైట్‌లో ప్రాథమిక కీ ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. కాగా, 11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పేపర్-1 కి 99,958 మంది..పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.


Similar News