TG TET-DSC:టెట్ పాసైన అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!
తెలంగాణలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షను మే 20 నుంచి జూన్ 2 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు.
దిశ,వెబ్‌డెస్క్:తెలంగాణలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షను మే 20 నుంచి జూన్ 2 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ పేపర్-1 లో 67.13 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. పేపర్-2 లో 34.18 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ క్రమంలో టెట్ పాసైన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ పాసైన వారు డీఎస్సీ ఉచితంగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది.
ఇందుకోసం వెబ్ సైట్ లో మార్పులు చేసినట్లు తెలిపింది. టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించే అవకాశం లేనందున, డీఎస్సీకి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని పాఠశాల విద్యాశాఖ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. టెట్ పాస్ కాని వారు వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.