మైనర్ల కోసం మస్త్ స్కీం తెచ్చిన సెంట్రల్‌ గవర్నమెంట్.. రూ.1000 పెట్టుబడితో బంగారు భవిష్యత్తు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 18వ తేదీన ఎన్‌పీఎస్-వాత్సల్య యోజన స్కీంను ప్రారంభించబోతున్నారు.

Update: 2024-09-18 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఈ రోజు (బుధవారం) ఎన్‌పీఎస్-వాత్సల్య యోజన స్కీం (nps vatsalya yojana)ను ప్రారంభించబోతున్నారు. రాజధాని ఢిల్లీ (Delhi)తో పాటు దేశంలోని మరో 75 ప్రాంతాల్లో ఈ స్కీంను ఏకకాలంలో ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ఆర్థిక మంత్రి స్వయంగా ఈ స్కీంను ప్రారంభించనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ (Video Conference) ద్వారా ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్కీం ప్రకారం.. మైనర్ సబ్‌స్క్రైబర్‌లకు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (PRAN) కార్డ్‌లను ప్రభుత్వం అందిస్తుంది. అలాగే ఈ స్కీంకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కేంద్ర మంత్రి ప్రకటిస్తారు.

అయితే ఈ పథకం ద్వారా మైనర్లకు కలిగే లాభాలేంటి..? అసలు వారి భవిష్యత్తుకు ఈ పథకం ఏ విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుస్తుందాం. ఈ స్కీంలో తల్లిదండ్రులు (Parents) తమ పిల్లల పేరుతో సంవత్సరానికి కనీసం రూ.1,000తో పొదుపు చేయడం ప్రారంభించవచ్చు. దీనివల్ల పేద, మధ్యతరగతి వారికి కూడా ఈ పథకం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఈ పొదుపుపై చక్రవడ్డీ లభిస్తుంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు పొదుపు చేసినట్లైతే మంచి రిటర్న్ లభిస్తుంది. అలాగే పిల్లల వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతాను ఎన్‌పీఎస్ (NPS) ఖాతాగా మార్చడం జరుగుతుంది.

ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన అనేది తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ముందుగానే ప్రారంభించడం, క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా, కుటుంబాలు తమ పిల్లల కోసం పెద్ద కార్పస్‌ను సృష్టించవచ్చు. భారతీయ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ తమ పిల్లల పేరు మీద ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ స్కీంలో పిల్లవాడు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఖాతా నుండి నిధులను ఉపసంహరించుకోవచ్చు. లేదా 60 సంవత్సరాల వయస్సులో పెన్షన్ పొందవచ్చు.

అంతేకాకుండా ఒకవేళ అత్యవసరమైతే.. 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి తర్వాత పొదుపు మొత్తంలో నుంచి విద్య, తీవ్రమైన అనారోగ్యం, వైకల్యం వంటి అవసరాల కోసం డిపాజిట్ మొత్తంలో 25% విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా గరిష్టంగా 3 సార్లు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇప్పటికే ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 2024-25 కేంద్ర బడ్జెన్ సమయంలో ప్రత్యేక ప్రకటన చేసింది.


Similar News