రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష..నిమిషం ఆలస్యం ఐనా నో ఎంట్రీ

ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2024 ఈ నెల 26న( ఆదివారం) జరగనుంది.

Update: 2024-05-25 02:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2024 ఈ నెల 26న( ఆదివారం) జరగనుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షలకు ఎక్కువ సంఖ్యలో తెలంగాణ, ఏపీ నుంచి హాజరుకానున్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి దాదాపుగా 46 వేల అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు. ఐఐటీ మద్రాస్ నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.

ఈ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్ల కింద పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. అన్‌లైన్ల్‌లో నిర్వహించే ఈ ఎగ్జామ్‌లో అభ్యర్థులు రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. మొదటి సెషన్ మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు జరగనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా లోపలికి అనుమతించరు. పరీక్షకు రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి.


Similar News