దూరవిద్య ద్వారా కొత్త కోర్సులు.. ఈ ఏడాది నుంచి ఓయూలోనూ అమలు

దూర విద్య ద్వారా చదువుకునే విద్యార్థులకు శుభవార్త. కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ యూజీసీ నిర్ణయం తీసుకుంది

Update: 2023-03-21 11:06 GMT

దిశ, ఎడ్యుకేషన్: దూర విద్య ద్వారా చదువుకునే విద్యార్థులకు శుభవార్త. కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ యూజీసీ నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీ రామ్‌ రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టన్స్‌ ఎడ్యుకేషన్‌ ఈ ఏడాది నుంచి 70 కోర్సులను నిర్వహించనుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఇటీవల అనుమతి ఇచ్చింది. మొదటి కేటగిరీ విద్యాసంస్థలు యూజీసీ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే దూర విద్య కోర్సులను నిర్వహించుకోవచ్చు.

ఉస్మానియా యూనివర్సిటీతో పాటు.. కురుక్షేత్ర వర్సిటీ, ఆంధ్ర వర్సిటీల్లో 21 కోర్సుల చొప్పున అనుమతిని జారీ చేసింది. పీజీఆర్‌ఆర్‌సీడీఈలో మరో ఐదు కోర్సులు ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్సుల వివరాల్లోకి వెళ్తే.. ఓయూలో.. ఒక పీజీ, ఒక డిగ్రీ కోర్సులుండగా, మరో మూడు కోర్సులకు రూపకల్పన చేస్తున్నారు. కొత్తగా ఈ ఏడాది పీజీ డిప్లొమా ఇన్‌ డాటాసైన్స్‌, వేదిక్‌ ఆస్ట్రాలజి డిప్లొమా కోర్సు, ఆంత్రోపెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌, యోగా సర్టిఫికెట్‌ కోర్సులు నడుస్తున్నాయి.

వర్సిటీల వారీగా కొత్త కోర్సులు:

గురునానక్ దేవ్ పంజాబ్ యూనివర్సిటీ : 8

ఉత్కల్ ఒడిశా :17

భారతివిద్యాపీఠ్‌ మహారాష్ట్ర : 9

కురుక్షేత్ర హర్యానా : 21

ఆంధ్ర యూనివర్సిటీ: 21

ఉస్మానియా యూనివర్సిటీకి : 70

Tags:    

Similar News