NEET యూజీ-2023 టైం టేబుల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నీట్ యూజీ - 2023 పరీక్షను మే 7న నిర్వహించనున్నారు.
దిశ, ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నీట్ యూజీ - 2023 పరీక్షను మే 7న నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు.
కరోనాకు ముందు మాదిరిగా నిర్వహించేలా కాలపట్టికను ఎన్‌టీఏ ప్రకటించింది. నీట్‌ను ప్రస్తుత విద్యా సంవత్సరానికి జులై 17న నిర్వహించగా, వచ్చే విద్యా సంవత్సరానికి మే 7న నిర్వహించనున్నారు. అంటే రెండు నెలల 10 రోజులు ముందుగా పరీక్షను నిర్వహించనున్నారు. దీని వల్ల కరోనా సమయంలో విద్యా సంవత్సరం లో వచ్చిన గ్యాప్ ను ఈ ఏడాది నుంచి గాడినపడిన పడే విధంగా ఎన్‌టీఏ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించింది.
ఇవి కూడా చదవండి :