NEET UG 2023 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీ ఎప్పుడంటే..?
దేశంలోని మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి నీట్‌ను అర్హత పరీక్షగా నిర్వహిస్తారు.
దిశ, ఎడ్యుకేషన్: దేశంలోని మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి నీట్‌ను అర్హత పరీక్షగా నిర్వహిస్తారు. తాజాగా నీట్-2023 (NEET 2023) UG నోటిఫికేషన్ విడుదలైంది. మే 7వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 06, 2023 గా పేర్కొంది.
అర్హత: ఇంటర్ పాసైన అభ్యర్థులతో పాటు ఈ సంవత్సరం ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లో బయాలజీ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి. అంతేకాకుండా జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఇంటర్లో తప్పనిసరిగా కనీసం 50 శాతం స్కోర్, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం స్కోర్ చేసి ఉండాలి.
వయసు: కనీసం 17 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్షా విధానం:
నీట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరగనుంది.
పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు.
నీట్ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది.
ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది.
ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది.
ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఉంటాయి.
బయాలజీ నుంచి మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
నీట్-2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ తో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు.
దరఖాస్తు: ఆన్లైన్లో చేయాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 06, 2023
వెబ్సైట్: https://neet.nta.nic.in