నీట్ ఎగ్జామ్ 2023: బయాలజీ ఈజీ.. కెమెస్ట్రీ టఫ్​

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్) 2023 ముగిసింది.

Update: 2023-05-07 17:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్) 2023 ముగిసింది. అయితే ఈ సారి బయాలజీ ప్రశ్నలు ఈజీగా రాగా.. కెమెస్ట్రీ క్వశ్చన్స్​ టఫ్​గా వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. ఓవరల్​గా గతేడాది కంటే ప్రశ్నపత్రం సులువుగా వచ్చిందని స్పష్టం చేశారు. కోచింగ్ సెంటర్ల నిర్వహుకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు నీట్ పరీక్ష జరిగింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సుమారు 20.5 లక్షల మంది ఎగ్జామ్‌ రాయగా.. మన రాష్ట్రం నుంచి దాదాపు 70 వేల మంది పరీక్ష రాసినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగాం, కొత్తగూడెం, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌, నల్గొండ, నిజామాబాద్‌, సిద్దిపేట, సూర్యాపేట్‌ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల తర్వాత విద్యార్ధులను పరీక్షా హాల్​లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 తర్వాత వచ్చినోళ్లను ఎవరినీ లోపలికి పంపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 115 కేంద్రాల్లోనూ ఇదే రూల్​ ను ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఎన్​టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విధించిన నిబంధనలు విద్యార్ధులకు చిక్కులు తెచ్చాయి.

ఎగ్జామ్​ కేంద్రాల్లోకి జియోమెట్రీ, పెన్సిల్‌ బాక్స్‌, ప్లాస్టిక్‌ పౌచ్‌, క్యాలిక్యులేటర్‌, పెన్‌, స్కేల్‌, రైటింగ్‌ ప్యాడ్‌, పెన్‌ డ్రైవ్‌, ఏరేజర్‌,లాగ్‌ టేబుల్‌, ఎలక్ట్రానిక్‌ పేన్‌స్కానర్‌తో పాటు మొబైల్‌ ఫోన్‌, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌, మైక్రోఫోన్‌, పేజర్‌, హెల్త్‌ బ్యాండ్‌, బెల్ట్స్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, గగూల్స్‌, క్యాప్స్​తో పాటు వాచ్​, బ్రాస్‌లెట్‌, బంగారు అభరణాలు, ఫుడ్‌ ఐటెమ్స్‌, వాటర్‌ బాటిల్స్‌ వంటి వేవీ అనుమతించలేదు. కొన్ని కేంద్రాల్లో పుల్​షర్ట్ వేసుకొచ్చిన విద్యార్ధులకు ఊహించని అనుభవం ఎదురైంది. అక్కడిక్కడ షర్ట్​లను కత్తిరించి మరీ లోపలకి పంపించినట్లు సోషల్​మీడియాల్లో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఇదిలా ఉండగా, మన రాష్ట్రం నుంచి గతేడాది 59 వేల మంది ఎగ్జామ్ రాయగా 56 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఈసారి ఎగ్జామ్ రాసిన 65 వేల మందిలో కనీసం 40 నుంచి 45 వేల మంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త మెడికల్​ కాలేజీలతో కలపి మన రాష్ట్రంలో 8 వేలకుపైగా ఎంబీబీఎస్‌ అందుబాటులో ఉన్నాయి. మెరిట్ బేసిస్​లో ఆయా కాలేజీల్లో వివిధ కేటగిరీల్లో అడ్మిషన్లు లభించనున్నాయి.


Tags:    

Similar News