MIDHANI: మిథానిలో అసిస్టెంట్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..టెన్త్, ఐటీఐ, డిప్లొమా పాసైతే చాలు
టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా పాసై ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.
దిశ, వెబ్డెస్క్: టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా పాసై ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారిని ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్(Fixed Term Contract) ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ పోస్టులకు హైదరాబాద్(HYD)లోని కంచన్బాగ్(Kanchanbagh) ఏరియాలో ఉన్న మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియంలో వాక్ఇన్ ఇంటర్వ్యూలు(Walk-in Interviews) నిర్వహిస్తున్నారు.
పోస్టుల వివరాలు:
- అసిస్టెంట్ మెటలర్జీ (Assistant Metallurgy): 13 పోస్టులు
- అసిస్టెంట్ మెకానికల్ (Assistant Mechanical): 02 పోస్టులు
- అసిస్టెంట్ ఫిట్టర్ (Assistant Fitter): 09 పోస్టులు
- అసిస్టెంట్ వెల్డర్ (Assistant Welder): 04 పోస్టులు
- అసిస్టెంట్ డ్రైవర్ (Assistant Driver): 03 పోస్టులు
విద్యార్హత:
పోస్టును బట్టి క్లాస్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే లైట్/హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
రాతపరీక్ష, ట్రేడ్/ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు:
అక్టోబర్ 28, 29 ; నవంబర్ 25, 26, 27
జీతం:
అసిస్టెంట్ మెటలర్జీ/మెకానికల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,720, అసిస్టెంట్ ఫిట్టర్/వెల్డర్ పోస్టులకు రూ.28,960. అసిస్టెంట్ డ్రైవర్ పోస్టులకు రూ.27,710 జీతం ఉంటుంది.