జేఈఈ సిలబస్‌లో కీలక మార్పులు.. ఎక్కువగా ఈ సబెక్ట్‌లోనే తగ్గింపు
జేఈఈ మెయిన్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షలు రెండు దశల్లో నిర్వహిస్తారు. జనవరిలో మొదటి విడత, ఏప్రిల్‌లో రెండో విడత ఎగ్జామ్స్ ఉంటాయి. కాగా నవంబర్ 30 వ తేదీన రాత్రి 9గంటల వరకు జేఈఈ మొదటి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మొదటి విడత పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 12న ఫలితాలు వెల్లడవుతాయని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. జేఈఈ రెండో విడత పరీక్షలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 వ తారీకు రాత్రి 9 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 25న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది.
అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈసారి పరీక్ష సెలబస్‌ను కూడా తగ్గించింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితంలోని కొన్ని అంశాలను తీసేసింది. అధికంగా కెమిస్ట్రీలో 25 శాతం సిలబస్‌ను తగ్గించింది. ఫిజిక్స్‌లో 14 అంశాలను తొలగించింది. దీనిలో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, డాప్లర్ ఎఫెక్స్ ఇన్ సౌండ్స్, కార్టన్ ఇంజిన్ అండ్ ఎఫిషియెన్సీ, ఫోర్స్‌డ్ అండ్ డంపుడ్ ఆస్కిలేషన్ లాంటి పలు అంశాలు ఉన్నాయి. గణితంలో రెండు అంశాలను తొలగించినట్టు ఎన్టీఏ వెల్లడించింది.
కాగా 2022, 2023, 2024 విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీయట్ 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. విద్యార్థులకు ఏమైనా సందేహాలున్నట్లైతే 011040759000 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని ఎన్టీఏ తెలిపింది.