పదో తరగతి అర్హతతో జాబ్స్..నోటిఫికేషన్ విడుదల

పదో తరగతి పాసైన విద్యార్థులకు సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్‌మెంట్ సెల్’ మొత్తం 2,424 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.

Update: 2024-07-16 15:01 GMT

దిశ,వెబ్‌డెస్క్: పదో తరగతి పాసైన విద్యార్థులకు సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్‌మెంట్ సెల్’ మొత్తం 2,424 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈక్రమంలో వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో అధికారిక వెబ్‌సైట్‌పై rrccr.com ఆన్‌లైన్‌లో ఆగస్టు 15 లోపు దరఖాస్తు సమర్పించాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. 10వ తరగతిలో 50 శాతం మార్కులతో పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవాలంటే వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. వయోపరిమితికి జూలై 15 కటాఫ్ తేదీ కాగా అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులను సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. పూర్తి వివరాల కోసం అధికారికి వెబ్‌సైట్‌ని సందర్శించండి.


Similar News