జెఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు విడుదల..డౌన్‌లోడ్ లింక్ ఇదే!
జేఈఈ అడ్వాన్డ్స్ 2024 అడ్మిట్ కార్డులు ఈ రోజు (శుక్రవారం) విడుదల అయ్యాయి.
దిశ,వెబ్‌డెస్క్: జేఈఈ అడ్వాన్డ్స్ 2024 అడ్మిట్ కార్డులు ఈ రోజు (శుక్రవారం) విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం రెండు విడతల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ నెల 26వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష మొత్తం రెండు సెషన్లలో జరుగుతుంది.
ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 మొత్తం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్1 పరీక్ష జరుగగా, మధ్యాహ్నం షిఫ్ట్‌లో పేపర్-2 పరీక్ష 2.30 నుంచి 5.30 గంటల వరకు జరగనుంది. ఈ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన వారు దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష అప్లై చేసుకున్న అభ్యర్థులు https://jeeadv.ac.in ఈ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరు. మే 26వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అనంతరం జూన్ 2వ తేదీన ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేస్తారు. జూన్ 9వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు.
Read More..
Inter Supply Exams 2024: అలర్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్