JEE అడ్వాన్స్‌డ్ 2024 ఎగ్జామ్ తేదీ విడుదల
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో బీటెక్ సీట్ల భర్తీకోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్‌డ్) 2024 ఎగ్జామ్ తేదీని NTA విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో బీటెక్ సీట్ల భర్తీకోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్‌డ్) 2024 ఎగ్జామ్ తేదీని NTA విడుదల చేసింది. పరీక్షను మే 26, 2024న రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ: ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30, 2024 వరకు ఉంటుంది. పరీక్ష ఫీజు మే 6వ తేదీలోగా చెల్లించాలి. అడ్మిట్ కార్డ్‌లు మే 17 నుండి మే 26 వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. JEE మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. దీనిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా IIT,NIT,IIIT తదితర విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: https://jeeadv.ac.in/