ఇండియన్ హిస్టరీ
సింధు పట్టణం పాకిస్థాన్‌లో సింథ్ రాష్ట్రంలో సింధు అనే నదీ తీరాన నవాబ్‌షా జిల్లాలో ఉంది. ఇచట తవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్ (1935)(నిర్మాణాలలో ఇటుక, రాయిని ఉపయోగించారు).
సింధు నాగరికత
సింధు పట్టణం పాకిస్థాన్‌లో సింథ్ రాష్ట్రంలో సింధు అనే నదీ తీరాన నవాబ్‌షా జిల్లాలో ఉంది.
ఇచట తవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్ (1935)(నిర్మాణాలలో ఇటుక, రాయిని ఉపయోగించారు).
ఈ నగరాన్ని బొమ్మల కేంద్రం అని, పారిశ్రామిక నగరం అని కూడా అంటారు.
రక్షణ గోడలేని ఏకైక పట్టణంగా చన్చుదారోను పేర్కొనవచ్చు.
చన్హుదారో బయటపడినవి:
అలంకరణ పెట్టె
సిరాబుడ్డి
గవ్వల తయారీ కేంద్రం
నటరాజ విగ్రహం
ఎల్ ఆకారపు ఇటుకలు
పూసల పరిశ్రమ
అలంకరించిన ఏనుగు
అమ్రి పట్టణం:
ఇది పాకిస్థాన్‌లో సింథ్ రాష్ట్రంలో సింధు నదీ తీరంలో ఉంది.
ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది ఎన్.జి మజుందార్
జుంగార్ సంస్కృతి ఖడ్గ మృగం అవశేషాలు బయటపడ్డాయి.
సింధు నాగరికత కంటే ముందే వెలసిన పట్టణంగా పేరు.
కోట్ డిజి:
ఇది పాకిస్థాన్‌లో సింథ్ రాష్ట్రంలో సింధు నదీ తీరంలో ఉంది.
ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపింది క్యూరే, ఎఫ్.ఎ.ఖాన్
కోట్‌డిజిలో రాతి బాణాలు, 5 అమ్మతల్లి విగ్రహాలు, కంచు గాజు బయటపడ్డాయి.
అగ్ని ప్రమాద కారణంగా అంతమైనట్లు తెలుస్తుంది.
అల్లాహ్ దిన్హ్
బంగారంచే నింపబడిన కుండ, వెండితో తయారు చేసిన 2 ఆభరణాలు, 2 నక్లెస్‌లు లభ్యమయ్యాయి.
లోథాల్:
ఇది గుజరాత్‌లో గల భాగవా అనే నది తీరంలో ఉంది.
దీనిని మినీ హరప్పా లేదా కాస్మోపాలిటన్ నగరం అని పిలుస్తారు.
లోథాల్‌లో త్రవ్యకాలు జరిపింది ఎస్.ఆర్.రావు (1959)
సింధు నగరాలన్నింటిలోనూ తూర్పు దిక్కున ముఖద్వారం కల్గిన ఏకైక పట్టణం.
లోథాల్‌లో బయటపడినవి
సతీసహగమనానికి సంబంధించిన ఆధారాలు
చెస్ బోర్డులు
పంచతంత్రం కథతో కూడిన కుండలు
కాల్చిన మట్టితో చేసిన గుర్రపు బొమ్మ
కాళీభంగన్:
ఈ నగరం ఘగ్గర్ నదీ తీరాన ఉంది.
కాళీభంగన్‌లో తవ్వకాలు చేపట్టింది ఎ.ఘోష్ (1951)
కాళీభంగన్ సంస్కృతికి సోధీ సంస్కృతి అని పేరు పెట్టింది ఎ.ఘోష్
అమ్మతల్లిని పూజించని ఏకైక నగరం ఇది.
కాళీభంగన్ అనగా నల్లటి గాజులు అని అర్థం.
వీరు అగ్నిని అర్కడ, ఆథ అనేవారు.
భారతదేశంలో ప్రాచీన భూకంపం క్రీ. పూ 2600 లలో కాళీభంగన్‌లోనే వచ్చింది.
కాళీభంగన్‌లో బయటపడినవి:
దున్నినట్లు ఆధారాలు
గాజుల పరిశ్రమ
ఒంటె అవశేషాలు
కొయ్య నాగలి
హోమగుండంనకు సంబంధించిన ఆధారాలు
బన్వాలి పట్టణం:
ఈ నగరం సరస్వతీ నదీ తీరాన కలదు.
బన్వాలిలో తవ్వకాలు చేపట్టింది
ఆర్.ఎస్.బిస్త్
ఈ నగరంలో కుమ్మరి చక్రం, బార్లీ పంటకు సంబంధించిన ఆధారాలున్నాయి.
12 పులుల బొమ్మలతో ఆధారాలున్నాయి.
భూగర్భ మురుగు నీటి వ్యవస్థ లేని నగరం ఇది. బన్వాలిలో రహదారులు గ్రిడ్ పద్ధతులలో నిర్మించలేదు.
హరప్పా పట్టణం:
సింధు నాగరికతలో బయల్పడిన తొలి పట్టణం హరప్పా.
దీనిని ధాన్యాగారాల నగరం/ సిటీ ఆఫ్ గ్రాసరీస్)/ గేట్ వే సిటీగా పిలుస్తారు.
ఈ నగరం పాకిస్థాన్‌లో పంజాబ్ రాష్ట్రంలో మాంటిగోమరీ జిల్లాలో కలదు.
ఈ నగరం రావి/పరుషిణి/ఐరావతి/లాహోర్ నదీ తీరంలో ఉంది.
హరప్పాలో తవ్వకాలు చేపట్టినది సర్ దయారాం సహాని (1921)
హరప్పాలో బయటపడినవి:
12 చిన్న ధాన్యాగారాలు
H ఆకారంలో ఉండే స్మశాన వాటిక
మట్టితో నిర్మించిన రక్షణ గోడ
కార్మికుల నివాస గృహం
కాంస్య అద్దం, పాము ముద్రిక
రాతి నటరాజ విగ్రహం
ఎర్రటి ఇసుక (టెర్రకోట)తో తయారు చేసిన మనిషి మొండెం అకారం.
హుయాన్‌త్సాంగ్ వర్ణించిన ఫోపాతో నగరం హరప్పా అని అలెగ్జాండర్ కన్నింగ్‌హాం పేర్కొన్నాడు.
మొహంజొదారో పట్టణం:
సింధు నాగరికత ముఖ్యపట్టణం మొహంజదారో.
ఈ నగరం లాంక్‌షైర్ (యూకె) నగరాన్ని పోలి ఉంది.
ఇది పాకిస్థాన్‌లో గల సింధ్ భాషలో మృతదేహాల దిబ్బ అని అర్థం.
దీనినే నిఖిలిస్తాన్ (గార్డెన్‌సిటీ) అంటారు.
మొహంజొదారో 7 పొరలలో బయటపడింది.
మొహంజొదారోలో బయటపడినవి
అతిపెద్ద ధాన్యాగారం/హమామ్
మహాస్నాన వాటిక
కంచుతో తయారు చేసిన నగ్న నర్తకి విగ్రహం
రెండు రాగి గొడ్డళ్లు (ఆర్యులకు చెందినవి)
ఎద్దుల బండి (ఆకులు లేని చక్రం)
కాంస్య ఖడ్గం
పిల్లి, నక్క ముఖాలు కలిగిన మానవుల ముద్రలు
పశుపతి విగ్రహం
అతిపెద్ద సమావేశ మందిరం
ఎద్దు ముద్రిక
24 స్థంభాలతో స్థంబ మండలం
ప్రత్తి పంటకు సంబంధించి
ఏనుగు, పులి గుర్తులు గల ముద్ర
అన్నింటి కంటే పెద్ద నగరం
రోపార్ నగరం:
ఈ నగరం సట్లజ్ నదీ తీరాన ఉంది.
యజమాని మరణానంతరం అతడు పెంచుకున్న కుక్కను కూడా పూడ్చిపెట్టేవారు.
ఈ నగరం స్వాతంత్య్రానంతరం బయటపడింది.
దోల్‌వీరా పట్టణం:
భారతదేశంలో అతి పెద్ద నగరం
ఈ నగరం లూనీ నది తీరాన ఉంది.
ఇక్కడ నిర్మాణాలన్నీ రాతితో నిర్మించేవారు.
దోల్‌వీరాలో తవ్వకాలు చేపట్టింది ఆర్.ఎస్.బిస్త్
డోల్‌వీరాలో బయటపడినవి
నీటి రిజర్వాయర్
ఏకశిలా స్థంభాలు
10 గుర్తులతో హరప్పా లిపి ముద్రిక
క్రీడా ప్రాంగణం
సుర్కొటోడా పట్టణం:
ఇది తపతి నదీ తీరంల ఉంది.
రాతితో నిర్మించిన రక్షణ గోడ కల ఏకైక నగరం.
ఇక్కడ తవ్వకాలు చేపట్టింది జగపతి జోషి.
తవ్వకాల్లో బయపడినవి
గుర్రం అవశేషాలు
కుండలలో మృతదేహాలు పూడ్జుట
దుప్పి ఆధారాలు లభ్యం
అలంగీర్‌పూర్:
గంగా యమున మైదాన ప్రాంతంలో బయటపడిన నగరం ఇది.
ఈ నాగరికత క్షీణదశను సూచిస్తున్న నగరం ఇది.
దియామ్‌బాద్:
గోదావరి ఉపనది అయిన పవరా నదీ తీరంలో ఉంది.
2004లో ఈ నగరం బయటపడింది.
ఇక్కడ కంచు ఏనుగు, కంచు రధం, కంచు ఖడ్గమృగం ముద్రికలు బయల్పడినవి.
రంగాపూర్:
1931లో ఎం.ఎస్ వాట్స్ త్రవ్వకాలు జరిపారు.
భదర్ నదీ తీరంలో ఉంది.
ఇక్కడ వరి పండించినట్లు ఆధారాలున్నాయి.
ఇవి కూడా చదవండి :