Good News:4660 పోలీస్ ఉద్యోగాలు..రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం
నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆర్ఆర్బీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లోని 4660 SI, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ,వెబ్‌డెస్క్:నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఆర్ఆర్బీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లోని 4660 SI, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. RPF లో 4660 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. SI పోస్టులు 452, కానిస్టేబుల్ ఉద్యోగాలు 4,208 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు అన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://rpf.indianrailways.gov.in/RPF/ వెబ్సైట్ ని సంప్రదించండి.
విద్యార్హతలు:సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం SSLC (10వ తరగతి) చదివి ఉండాలి.
వయోపరిమితి:SI పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు - 25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు - 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ:అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) చేస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అర్హులైన అభ్యర్థులు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు:సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం ఇస్తారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 శాలరీ ఇస్తారు.