ఆగస్టు 30 నుంచి GATE-2024 అప్లికేషన్

దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్యాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది

Update: 2023-08-25 15:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్యాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ఆగస్టు 24 న ప్రారంభం కావాల్సి ఉండగా దాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు వాయిదా వేసింది. పరీక్షలను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొత్తగా AI, డేటా సైన్స్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. అభ్యర్థులు అప్లికేషన్, ఇతర వివరాల కోసం https://gate2024.iisc.ac.in/ను సందర్శించవచ్చు.


Similar News