మెటా మైండ్ అకాడమీ ఆధ్వర్యంలో నీట్ ఉచిత అవగాహన తరగతులు
మెటా మైండ్ అకాడమీ ఆధ్వర్యంలో నీట్ ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఎలా అనే అంశంపై మెటా మైండ్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఉచిత అవగాహన సదస్సు పోస్టర్ ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెటా మైండ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఉచిత అవగాహన సదస్సు ప్రత్యకంగా బాలికల కోసమే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న 120 మందికి ఉచితంగా వసతి కల్పించి క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.
జూన్ 3వ తేదీ నుంచి ఈ క్లాసులు నిర్వహిస్తామని, మూడు రోజులు అంటే జూన్ 5వ తేదీ వరకు తరగతులు ఉంటాయన్నారు. నీట్ సాధనలో ఎదురయ్యే సవాళ్లు, మెంటార్ షిప్, టెస్ట్ సిరీస్, ఇతర నూతన ప్రిపరేషన్ విధానాలపై తరగతులు ఉంటాయని వెల్లడించారు. డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం 85229 58575 లేదా 70322 64910 నంబర్లకు సంప్రదించాలని మనోజ్ కుమార్ కోరారు.