బెంగళూరు IISCలో బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాం
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
దిశ, ఎడ్యుకేషన్: బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు కేవీపీవై/ఇన్‌స్పైర్/ఐఐఎస్సీ ఉపకార వేతనం లభిస్తుంది.
ప్రోగ్రాం వివరాలు:
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్) ప్రోగ్రాం
పరిశోధనాంశాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథ్స్, ఫిజిక్స్.
అర్హత: 60 శాతం మార్కులతో 2022లో 10+2/ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ) తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత ఏడాదిలో పరీక్షకు హాజరవుతున్న వారు అర్హులే.
ఎంపిక: కేవీపీవై - 2021/జేఈఈ అడ్వాన్స్ డ్ - 2023/నీట్ (యూజీ) -2023/ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2023 స్కోరు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: మే 31, 2023.
వెబ్‌సైట్: https://iisc.ac.in