"బ్లూ రిబ్బన్"... విదేశీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు రక్షణ కవచం
విదేశాల్లో ఉన్నటువంటి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు తోడ్పాటుగా నిలుస్తోంది బ్లూ రిబ్బన్.
దిశ, వెబ్ డెస్క్: విదేశాల్లో ఉన్నటువంటి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు తోడ్పాటుగా నిలుస్తోంది బ్లూ రిబ్బన్.
అసలేంటి ఈ బ్లూ రిబ్బన్?
విదేశాల్లోని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యమై ఉన్న ఒక పెద్ద సంస్థ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక కన్సల్టెన్సీ. విద్యార్థిని విద్యార్థులను విదేశాలకు పంపించిన తర్వాత కూడా వారికి రక్షణగా ఉంటూ.. అక్కడ ఉన్నటువంటి బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆఫీస్ స్టాఫ్, స్థానికంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ చదువుతున్న మన విద్యార్థిని విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. దీంతో పాటుగా విద్యార్థుల చదువులపై, వారి ఉద్యోగ అవసరాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే.. విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుందని ఎడ్యుకేషన్ సోషల్ మీడియా ఇంచార్జ్ గొల్లూరి గణేష్ తెలిపారు.