TGPSC:గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను TGPSC విడుదల చేసింది. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-12 13:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను TGPSC విడుదల చేసింది. జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రిలిమ్స్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయని తెలిపింది.

అభ్యర్థులు ఏ మీడియంను కోరుకున్నారో ఆ ప్రకారమే రాయాల్సి ఉంటుందని, కొన్ని పేపర్లు ఒక లాంగ్వేజ్ (మీడియం)లో రాసి మరికొన్ని వేరే మీడియంలో రాస్తే ఆ అభ్యర్థిని ఫలితాల్లో పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఒకే జవాబు పత్రాన్ని సగం ఒక మీడియంలో, మరికొంత మరో మీడియంలో రాసినా అది చెల్లుబాటు కాదని స్పష్టత ఇచ్చింది. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్‌లో మాత్రమే (హెచ్ఎండీఏ పరిధి) ఉంటాయి. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ని సందర్శించండి.

మెయిన్ పరీక్షలో ఇంగ్లీష్ పరీక్ష కేవలం భాషపై పట్టు కోసం నిర్వహిస్తున్నదేనని, అందువల్లనే దీన్ని క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌గా కమిషన్ పేర్కొంటున్నట్లు ఒక ప్రకటనలో సెక్రటరీ వివరణ ఇచ్చారు. పదవ తరగతి ఇంగ్లీషు సబ్జెక్టు స్టాండర్డ్ లో సిలబస్ ఉంటుందని, దాని ఆధారంగానే ఈ పరీక్షను నిర్వహిస్తామన్నారు. ఆ పేపర్‌లో ఎన్ని మార్కులు వచ్చినా వాటిని మిగిలిన సబ్జెక్టుల మార్కులతో కలపబోమన్నారు.

కేవలం ఆరు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ర్యాంకింగ్ ఫైనల్ అవుతుందన్నారు. ప్రతీ పేపర్‌కు 150 మార్కులు ఉంటాయన్నారు. మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అన్ని పేపర్లనూ రాయాల్సిందేనని, ఏ ఒక్కదానికి ఆబ్సెంట్ అయినా అర్హుల ఎంపిక జాబితాలో మినహాయిస్తామని స్పష్టం చేశారు. మొత్తం ఏడు పేపర్ల సిలబస్‌ను ఫిబ్రవరి 19న వెలువరించిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా పేర్కొన్నట్లు కార్యదర్శి గుర్తుచేశారు.

మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే..

అక్టోబ‌ర్ 21 – జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌(క్వాలిఫ‌యింగ్ టెస్ట్)

అక్టోబ‌ర్ 22 – పేప‌ర్ 1(జ‌న‌ర‌ల్ ఎస్సే)

అక్టోబ‌ర్ 23 – పేప‌ర్ 2(హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ జియోగ్ర‌ఫీ)

అక్టోబ‌ర్ 24 – పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌)

అక్టోబ‌ర్ 25 – పేప‌ర్ 4(ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్)

అక్టోబ‌ర్ 26 – పేప‌ర్ 5(సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్)

అక్టోబ‌ర్ 27 – పేప‌ర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేష‌న్)


 




Similar News